ప్రధాని మోదీకి జెలెన్ స్కీ ఫోన్
NEWS Aug 31,2025 09:40 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్ చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితుల గురించి వివరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకపక్షంగా దాడికి దిగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శాంతి పునరుద్ధరణకు తమ దేశం తరపున పూర్తి మద్దతు ఉంటుందని జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు ప్రధాని.