పెన్షన్ కోసం జగదీప్ ధన్ ఖడ్ దరఖాస్తు
NEWS Aug 31,2025 09:36 am
మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ తన పదవికి రాజీనామా చేశారు. 1993లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధన్‌ఖడ్. తనకు మాజీ ఎమ్మెల్యే కింద పరిగణిస్తూ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.