పార్టీలతో సంబంధం లేకుండా సపోర్ట్ చేయండి
NEWS Aug 31,2025 09:27 am
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ అగ్రనేతల మద్దతు కోరేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా గురించి స్పందించారు. ఆయనను చూస్తే తనకు జాలి కలుగుతోందన్నారు.