డేంజర్ మార్క్ దాటిన యమున నది
NEWS Aug 31,2025 09:23 am
ఢిల్లీలో యమునా నది ఉధృతి పెరిగింది. డేంజర్ మార్క్ దాటింది. అంతకంతకూ నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పాత రైల్వే బ్రిడ్జి దగ్గర 205.52 మీటర్ల నీటిమట్టంకు చేరుకుంది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబై-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వేతో పాటు మయూర్ విహార్‌లో శిబిరాలు ఏర్పాటు చేశారు.