6న ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
NEWS Aug 31,2025 09:17 am
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహంచనున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఇప్పటికే వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భారీ ఎత్తున భద్రతను కల్పించినట్లు వెల్లడించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్. భక్తులు సహకరించాలని కోరారు.