ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల
NEWS Aug 31,2025 09:11 am
తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు రూ. 700 కోట్లు ఒకేసారి రిలీజ్ చేసింది. జీతాలతో పాటు 20 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతన బిల్లులు రూ 392 కోట్లు అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపాయి.