సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి
NEWS Aug 31,2025 08:58 am
సెప్టెంబర్ 2న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి జరగనుంది. ఈ సందర్బంగా పులి వెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జగన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్ విజయమ్మ, భారతీ రెడ్డి, షర్మిలా రెడ్డితో పాటు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, శ్రేణులు భారీ ఎత్తున హాజరు కానున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వైఎస్సార్ అనుకోకుండా హెలికాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.