అస్తమించని సూరీడు పరిటాల రవి
NEWS Aug 31,2025 08:36 am
అస్తమించని సూర్యుడు పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు మంత్రి సవిత. పెనుకొండలో తన స్వంత నిధులతో పరిటాల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరిటాల రవి సతీమణి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు, ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.