అజారుద్దీన్‌కు మంత్రి పదవి?
NEWS Aug 30,2025 07:36 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్‌ను వదిలేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు పరిహారంగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఆమోదం రాగానే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో మైనారిటీ ప్రతినిధిత్వం లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్ గా ఆలోచిస్తున్నారని టాక్.