మృతుల కుటుంబానికి న్యాయం చేయాలి
NEWS Aug 31,2025 09:18 am
గుండాల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహా నిమజ్జన కార్యక్రమంలో అనుమానాస్పదంగా మరణించిన మోహన్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. శనివారం రాత్రి పాఠశాల వద్ద కుటుంబ సభ్యుల రోదన, నిరసన తో అట్టుడికి పోతుంది. 50 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. మోహన్ మరణం పట్ల న్యాయమైన విచారణ జరిపించాలన్నారు.