మౌలిక సదుపాయాల తనిఖీ
NEWS Aug 31,2025 09:19 am
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మణుగూరు ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు, బాలుర, బాలికల టాయిలెట్లపై భౌతిక తనిఖీ నిర్వహించారు. UDISE+ పోర్టల్‌లో సరిగా నమోదు చేయని వివరాలను సరి చూడడం ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.ఈ తనిఖీలో మొత్తం 12 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నట్లు గుర్తించారు.