'గిరిజన గ్రామాల్లోని రోడ్లను పట్టించుకోరా?'
NEWS Aug 31,2025 01:05 am
పినపాక ఏజెన్సీలో ఆదివాసీలు నివసించే పలు రహదారులు అధ్వానంగా ఉండి కనీసం మనుషులు నడవలేని విధంగా తయారయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు. పినపాక సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సుందరయ్య నగర్ లో ఆయన పర్యటించారు. బురద మయంగా ఉన్న రహదారిపైనే ఆయన సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రహదారిపై వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సుందరయ్య నగర్ కు రహదారి మంజూరు అయిన పాలకుల నిర్లక్ష్యంతో ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదన్నారు.