ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్
NEWS Aug 31,2025 01:04 am
కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ నేతృత్వంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్లతో ఈ బ్రోచర్ రూపకల్పన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజంలో ఎదురయ్యే సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తారని, వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా, ప్రజలతో మమేకమై ఉండాలని జర్నలిస్టులను కోరారు.