హాట్ టాపిక్‌గా మోదీ చైనా పర్యటన
NEWS Aug 30,2025 11:54 pm
ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. తియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు కోసం చైనా పర్యటన చేస్తున్నారు. చైనా మీడియా, సోషల్ మీడియాలో మోదీ పర్యటనపై విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా సుంకాలపై మోదీ దృఢ వైఖరికి చైనా నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పర్యటనతో భారత్-చైనా సంబంధాలు మెరుగుపడతాయని స్థానిక మీడియా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, విక్టరీ డే వేడుకలకు మోదీ గైర్హాజరు కావడం కొందరిలో అనుమానాలు రేపుతోంది. పర్యటనలో మోదీ జిన్‌పింగ్, పుతిన్ సహా పలు దేశాల నేతలతో సమావేశం కానున్నారని సమాచారం.