తెలంగాణకు బాలకృష్ణ ₹.50 లక్షల విరాళం
NEWS Aug 30,2025 11:49 pm
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రభావితమైన ప్రజల కోసం సాయం ప్రకటించారు. కామారెడ్డి సహా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఇది తన ఉడుతాభక్తి సహాయం అని ఆయన అన్నారు. తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపొర్లగా, చెరువులు నిండిపోవడంతో అనేక పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.