లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి షాక్
NEWS Aug 30,2025 07:18 pm
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది ఏసీబీ కోర్టు. ఈ మేరకు తనకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో ఏ38గా చెవిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే విచారణ చేపట్టిన సిట్ పలువురిని అరెస్ట్ చేసింది.