తెలుగు అధ్యయన కేంద్రానికి వెంకయ్య విరాళం
NEWS Aug 30,2025 07:05 pm
నెల్లూరులో ఏర్పాటు చేసిన తెలుగు ప్రత్యేక అధ్యయన కేంద్రం పనితీరు బాగుందని ప్రశంసించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్బంగా తన పెన్షన్ నుంచి రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో తాను ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేశానని చెప్పారు. ఆయా ప్రాంతాలలోని మాండలికాలను సేకరించాలని అధ్యయన కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ప్రాచీన పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాలని అన్నారు.