హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పం తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయనను అపర భగీరథుడంటూ కితాబు ఇచ్చారు. గత ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి షో చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం రూ.4000 కోట్లకుపైగా ఖర్చు చేసి కుప్పం వరకు నీటిని తెచ్చిందన్నారు. ఈ నీళ్లతో రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరందుతుందన్నారు. 6 లక్షలకు పైగా సాగవుతుందన్నారు.