కోరుట్లలో ఆకట్టుకుంటోన్న యాలకుల గణేశుడు
NEWS Aug 30,2025 05:46 pm
కోరుట్ల పోచమ్మ వాడలోని గ్రీన్ హోప్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన యాలకుల గణేశుడు విశేషంగా ఆకర్షిస్తోంది. భూమి పైన వినాయకుడు నిలబడి నీటిని అందిస్తున్నట్లు దీనిని తీర్చిదిద్దారు. నీటి సంరక్షణ అవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాటు చేశారు. నీటిని సంరక్షించడం, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చడానికి, పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఇది ఉపయోగ పడుతుందని నిర్వాహకులు తెలిపారు.