జగన్ వల్లనే హంద్రీ నీవా జలాలు
NEWS Aug 30,2025 04:38 pm
జగన్ లేకపోతే చంద్రబాబు జీవితంలో హంద్రీనీవా జలాలు తెచ్చేవాడు కాదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వలేక పోయాడన్నారు. కోటంరెడ్డి రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మర్చిపోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలు, దారుణాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.