గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
NEWS Aug 30,2025 03:55 pm
హైదరాబాద్ :- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ లను నియమించాలని శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో నియమించిన కోదండరాం పేరును కొనసాగిస్తూ, మరో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ స్ధానంలో అజారుద్దీన్ పేరు చేర్చారు. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు కాంగ్రెస్ తరపున అజారుద్దీన్‌ను పోటీ నుంచి తప్పించినట్లయింది.