రాజస్థాన్ రాయల్స్ కోచ్ కు ద్రవిడ్ గుడ్ బై
NEWS Aug 30,2025 03:30 pm
రాజస్తాన్ రాయల్స్ జట్టు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ అనూహ్యంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈసారి జరిగిన ఐపీఎల్ లో ఆయన శిక్షకుడిగా జాయిన్ అయ్యాడు. ఈ సందర్బంగా జట్టు ఆశించినంత మేర ఆడలేదు. కెప్టెన్ శాంసన్ ను తప్పించడం కూడా విమర్శలకు దారి తీసింది. ద్రవిడ్, సంజూ మధ్య పొరపొచ్చాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలో శనివారం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. ద్రవిడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడని తెలిపింది.