కుమ్మరపల్లిలో వినాయక నిమజ్జనం సందడి
NEWS Aug 30,2025 05:02 pm
చిట్వేలి మండలం నగిరిపాడు పంచాయతీ కుమ్మరపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కట్టా శివ తండ్రి కిట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదానం, ఉట్టి కొట్టడం, లడ్డు వేలం పాటలు గ్రామాన్ని సందడిమయంగా మార్చాయి. పెద్దలు, పిల్లలు, యువత ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.