భక్తులకు అందుబాటులో వేంకటాద్రి నిలయం
NEWS Aug 30,2025 03:17 pm
తిరుమలలో నూతనంగా నిర్మించిన వేంకటాద్రి నిలయాన్ని పరిశీలించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తుదిదశ నిర్మాణంలో ఉన్న దీని కోసం రూ. 102 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బోర్డు నిర్ణయం మేరకు దీనిని నిర్మించామన్నారు. పీఏసీ ద్వారా 2,500 మంది భక్తులకు ఉచితంగా వసతి సౌకర్యం కలుగుతుందన్నారు. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులు, 2 కళ్యాణకట్టలు, జల ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు.