యాత్రినివాస్ కు మంత్రి దుర్గేష్ ప్రారంభం
NEWS Aug 30,2025 02:59 pm
విశాఖపట్నం : ఏడాదిలో పర్యాటక రంగంలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం విశాఖ అప్పుఘర్ వద్ద సిద్ధమైన హరిత హోటల్ (యాత్రినివాస్) ను ఆర్కే బీచ్ దగ్గర టూరిజం సీఆర్ వో కౌంటర్ ను ప్రారంభించారు. సెప్టెంబర్ 5-7 వరకు జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ - 2025 బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.