చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా వారితో ముచ్చటించారు. తాము తీసుకు వచ్చిన స్త్రీ శక్తి పథకం ఎలా ఉందంటూ ఆరా తీశారు. మహిళల సాధికారత కోసం తమ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమల వరకు కూడా ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు సీఎం.