శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ
NEWS Aug 30,2025 02:03 pm
ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో పాటు అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఏఈవో శ్రీ వారి ప్రసాదాలు, ఫోటోను డీజీపీకి అందజేశారు. ఆలయ వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆయనను ఆశీర్వదించారు. CVSO మురళీకృష్ణ, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం ఉన్నారు.