సీఎంలకు లేఖ రాసిన స్టాలిన్
NEWS Aug 30,2025 01:44 pm
కేంద్ర , రాష్ట్ర సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం స్టాలిన్. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు లేఖ రాశారు. రాజ్యాంగ సవరణల ద్వారా బలమైన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ కుట్రకు తెర లేపిందని ఆరోపించారు. ఈ సమయంలో అందరు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాను రాను రాష్ట్రాలను మరింత బలహీన పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు.