యూరియా కొరతపై మండిపడ్డ సిపిఎం నేతలు
NEWS Aug 30,2025 05:03 pm
యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కన్ను మూసుకుంటుందా అంటూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మండిపడ్డారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులను కలిసి సమస్యలు విన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. నానో యూరియా వాడాలని చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఎందుకు అవగాహన కల్పించడం లేదన్నారు. రైతుల పక్షాన అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్ ,తదితరులు పాల్గొన్నారు.