నిర్మాత అల్లు అరవింద్ తల్లి కన్నుమూత
NEWS Aug 30,2025 12:38 pm
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య. చిరంజీవి, భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు టాలీవుడ్ నటీ నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.