మాగంటికి అసెంబ్లీ ఘన నివాళి
NEWS Aug 30,2025 07:33 am
హైదరాబాద్: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌కు తెలంగాణ శాసనసభ ఘన నివాళులర్పించింది. ఎమ్మెల్యే, సినీ నిర్మాతగా మాగంటి మూడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి గొప్ప సేవలు అందించారని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకు చెందిన కేటీఆర్, కూనంనేని, మహేశ్వరరెడ్డి తదితరులు మాగంటి సేవానిరతిని గుర్తుచేశారు. అసెంబ్లీని స్పీకర్ ప్రసాద్ ఆదివారానికి వాయిదా వేశారు.