టీడీఆర్ బాండ్ల స్కాంపై విచారణ చేపట్టాలి
NEWS Aug 30,2025 11:19 am
తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కాంపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. 2014-2019 మధ్య వందల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇదే అంశంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన మాట్లాడారని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారిణికి ఆ డబ్బు చేరిందని, ఆమె ఎవరో తేల్చాలని లేఖలో కోరారు సీఎంను. అంతిమ లబ్దిదారుడు ఎవరో తేల్చాలని స్పష్టం చేశారు.