శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు
NEWS Aug 30,2025 11:15 am
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 65 వేల 717 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 445 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు. స్వామి దర్శనం కోసం భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.