సీఎం సహాయ నిధికి వంగా విరాళం
NEWS Aug 30,2025 08:00 am
పాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. వంగా సందీప్ రెడ్డితో పాటు తన సోదరుడు వంగా ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా సీఎం సహాయ నిధికి తనవంతు సాయాన్ని ఇచ్చినందుకు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు రేవంత్ రెడ్డి.