భారీగా పడి పోయిన రూపాయి విలువ
NEWS Aug 30,2025 10:16 am
అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల ప్రభావంతో భారత దేశానికి చెందిన రూపాయి విలువ రికార్డు స్థాయికి పడి పోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ కు రూ. 87.97గా ఉంది. ఇదిలా ఉండగా భారత్ తో పాటు ఇతర దేశాలపై అమెరికా భారీ ఎత్తున టారిఫ్స్ విధించడం పట్ల ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది. దీనిపై పై కోర్టుకు వెళ్లనున్నారు ట్రంప్.