భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ
NEWS Aug 30,2025 10:10 am
గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. భారీ ఎత్తున వరద కొనసాగుతోంది. 43 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. స్నాన ఘట్టాలు, మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పర్ణశాల వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. సీతమ్మ విగ్రహాన్ని తాకుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కలెక్టర్.