కోటంరెడ్డికి హొం మంత్రి ఫోన్
NEWS Aug 30,2025 10:06 am
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హోం మంత్రి వంగలపూడి అనిత ఫోన్ చేశారు. తనను హతమార్చేందుకు ఏడుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేయడం, ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వివేకా హత్య తరహాలో కోటంరెడ్డిని మర్డర్ చేయాలని కుట్ర పన్నిన మహేష్, వినీత్, మల్లి, జగదీష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి హత్య ప్లాన్ వీడియోకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.