ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను
NEWS Aug 30,2025 10:02 am
మునుగోడు నియోజకవర్గం ప్రజలకు అన్యాయం జరిగితే తాను ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే సీఎంతో, సర్కార్ తో కొట్లాడేందుకు తాను వెనుకాడ బోనంటూ హెచ్చరించారు. తాను ఈ పదవిలో ఉన్నానంటే మీ అందరి ఆదరాభిమానాలే నని అన్నారు. మీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా లేదా అన్యాయం జరిగినట్లు భావించినా తనకు చెప్పాలన్నారు. నాపై విశ్వాసం ఉంచాలని కోరారు ఎమ్మెల్యే.