మృతికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష
NEWS Aug 30,2025 12:10 pm
2020లో మేడిపల్లి సమీప తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోను, ముప్కల్‌కు చెందిన దుంపటి లక్ష్మీరాజం కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయన్న మృతి చెందాడు. కేసు విచారణలో సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన మెట్‌పల్లి మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ నిందితుడు లక్ష్మీరాజంకు 10 నెలల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐ ఎల్. శ్రీను, కానిస్టేబుల్ చక్రపాణిలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారని సీఐ అనిల్ కుమార్ తెలిపారు.