ఐఏఎస్ శివశంకర్ ఏపీకి కేటాయింపు
NEWS Aug 30,2025 09:54 am
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎల్. శివ శంకర్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కేంద్ర పరిపాలన శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే శివశంకర్‌ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.