విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి
NEWS Aug 30,2025 09:51 am
విద్యా రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. ఒకే విభాగం పరిధిలోకి విద్యాశాఖ పరిధిలోని నిర్మాణాలు తీసుకు వస్తామన్నారు. గ్రీన్ ఛానల్ లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లిస్తామని, ప్రతి విద్యా సంస్థలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం.