తెలంగాణ విజిలెన్స్ డీజీగా విక్రమ్ సింగ్
NEWS Aug 30,2025 09:47 am
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ మాన్ ను నియమించింది. ఇప్పటి వరకు ఇదే పోస్టులో పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం మాన్ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్నారు.