ట్రంప్ కు భారీ ఎదురు దెబ్బ
NEWS Aug 30,2025 09:42 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలపై కీలక తీర్పు వెలువరించింది. టారిఫ్ లు చట్ట విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసింది. భారీగా విధించిన సుంకాలు భారత్ సహా పలు దేశాలను ప్రభావితం చేశాయని పేర్కొంది. దీంతో ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పును యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు ట్రంప్.