స్పోర్ట్స్ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవం
NEWS Aug 30,2025 12:45 am
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ఆదర్శ క్రీడా పాఠశాలలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ క్రీడా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఎం,యన్.చందు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని కూడా అలవరచు కోవాలనీ.. జాతీయ క్రీడాకారులను స్పూర్తిగా తీసుకొని ఆటలలో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.