కామారెడ్డిలో జాతీయ రహదారి 44పై భారీ ట్రాఫిక్ జామ్
NEWS Aug 29,2025 06:27 pm
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని 44వ నంబరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారి కోతకు గురవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలు గంటకు పైగా నెమ్మదిగా కదులుతున్నాయి. సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్‌గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.