స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఒప్పుకోం
NEWS Aug 29,2025 06:06 pm
కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అవసరం లేదని, చట్ట బద్దమైన రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. అంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42 శాతం కేటాయిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేదానికి అయితే 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపేసినట్లు అని ప్రశ్నించారు .