కాళేశ్వరం త్రివేణి సంగమంలో వరద ఉధృతి
NEWS Aug 29,2025 05:40 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల వర్షాలతో భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 9.71 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 85 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.