'టీనేజ్ బాలికలకు అవగాహన అవసరం'
NEWS Aug 30,2025 12:12 pm
పినపాక మండలం ఐలాపురం సమీపంలోని ఏల్చిరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, టీనేజ్‌లో బాలికలు ఎదుర్కొనే రుతుస్రావం, ఇతర సమస్యలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని తెలిపారు. ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ రమణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.