మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్
NEWS Aug 29,2025 05:32 pm
ఓబళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. తనకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీనిపై శ్రీలక్ష్మి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది ఎంఎం సుందరేష్, ఎన్ కె సింగ్ లతో కూడిన ధర్మాసనం.