వైద్యశాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
NEWS Aug 29,2025 04:47 pm
అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి బి.ఎస్.లతా సామాజిక వైద్యశాలను సందర్శించారు. హాస్పిటల్‌కి వచ్చే రోగుల పరిస్థితులు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కిచెన్ రూమ్ లో వంటకాల నాణ్యతను పరిశీలించారు. నూతన సామాజిక వైద్యశాల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆర్డిఓ ఎన్.శ్రీనివాస్, డా. అమరేశ్వర్, మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, విష్ణు, ముజీబ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.